అనంతలక్ష్మికే కాకినాడ రూరల్‌ సీటు

ABN , First Publish Date - 2021-10-20T05:16:54+05:30 IST

కరప, అక్టోబరు 19: రాబోయే ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ టికెట్టు పిల్లి అనంతలక్ష్మికి ఖాయమని, కావున నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఇప్పట్నించే పక్కా కార్యచరణతో ముందుకుసాగి పార్టీ గెలుపునకు కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు విజ్ఞప్తి చేశారు. టీడీపీ

అనంతలక్ష్మికే కాకినాడ రూరల్‌ సీటు

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు 

కరప, అక్టోబరు 19: రాబోయే ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ టికెట్టు పిల్లి అనంతలక్ష్మికి ఖాయమని, కావున నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఇప్పట్నించే పక్కా కార్యచరణతో ముందుకుసాగి పార్టీ గెలుపునకు కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు విజ్ఞప్తి చేశారు. టీడీపీ మండలా ధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన సత్తిబాబు కార్యకర్తలతో మాట్లాడారు. రూరల్‌ ఎమ్మెల్యేగా ఐదేళ్లు నిర్విరామంగా పనిచేసి నియోజకవర్గాన్ని ఏస్థాయిలో అభివృద్ధి చేసింది అం దరికీ తెలుసని, అయితే పార్టీకి చెందిన కొంతమంది తమపై కావాలని బురదజల్లే ప్రయత్నం చేయడం బాధనిపిస్తుందన్నారు. పార్టీ అధిష్టానం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని, అందరం సమష్టిగా పోరాడి పార్టీకి పూర్వవైభం తీసుకువద్దామన్నారు. అనంతరం మండల గ్రామాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పిల్లి దంపతులను సత్కరించారు. మండలాధ్యక్షుడు దేవు వెంకన్న, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గండి వెంకటేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి తాతీలు, పంపన కన్నారావు, పులపకూర మహేష్‌, కంటే సత్తిబాబు, బుజ్జిబాబు, దేవు జమిందారు, గట్టి రవి, మద్దూరి స్వామి, శేరు వీరబాబు, గుబ్బల భాస్కరరావు, ఆట్ల గోవిందరాజు కండవల్లి వెంకటేశ్వరరావు, చాట్ర ఇమ్మానుయేల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:16:54+05:30 IST