జీజీహెచ్ అభివృద్ధికి పటిష్ట చర్యలు: జేసీ
ABN , First Publish Date - 2021-10-30T05:28:05+05:30 IST
జీజీహెచ్ (కాకినాడ), అక్టోబరు 29: కాకినాడ జీజీహెచ్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జేసీ(హౌసింగ్) భార్గవతేజ కోరారు. సర్జరీ విభాగ సమావేశ మందిరంలో శుక్రవారం ఆస్పత్రి అధికారులతో సమీక్ష చేపట్టారు. ఆరోగ్యశ్రీ పథకం

జీజీహెచ్
(కాకినాడ), అక్టోబరు 29: కాకినాడ జీజీహెచ్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు
మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జేసీ(హౌసింగ్) భార్గవతేజ కోరారు.
సర్జరీ విభాగ సమావేశ మందిరంలో శుక్రవారం ఆస్పత్రి అధికారులతో సమీక్ష
చేపట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు మెరుగైన వైద్యసేవలందించడంలో మరింత
చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ల పనితీరును
మరింత మెరుగు పరచుకోవాలని ఆదేశించారు. ఈ పథకం లక్ష్యాల సాధనకు కృషి చేసి
ఆస్పత్రి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అత్యవసర సమయాల్లో
ఆరోగ్యశ్రీ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణలో అలసత్వం
వహిస్తే చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. సూపరింటెండెంట్ డాక్టర్
ఆర్.మహాలక్ష్మి, డీసీఎ్‌సఆర్‌ఎంవో డాక్టర్ అనిత, ఆర్‌ఎంవోలు తదితరులు
పాల్గొన్నారు.