పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలి: కమిషనర్‌

ABN , First Publish Date - 2021-12-31T06:01:11+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 30: పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య సిబ్బంది హాజరుపై కమిషనర్‌ నిఘా పెంచారు. ఈ మేరకు గురువారం వా

పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలి: కమిషనర్‌
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలిస్తున్న కమిషనర్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 30: పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య సిబ్బంది హాజరుపై కమిషనర్‌ నిఘా పెంచారు. ఈ మేరకు గురువారం వాటర్‌ వర్క్స్‌ ఆవరణలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సర్కిల్స్‌ వారీగా హాజరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని 14 శానిటరీ సర్కిల్స్‌ను సీసీకెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. కమిషనర్‌తో అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహరావు, హెల్తాఫీసర్‌ ఫృధ్వీచరణ్‌ , కమాండ్‌ కట్రోల్‌ సెంటర్‌ ఉద్యోగులు ఉన్నారు.

Updated Date - 2021-12-31T06:01:11+05:30 IST