కొంత శ్రద్ధతో కొండంత ప్రగతి
ABN , First Publish Date - 2021-07-09T05:27:26+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), జూలై 8: పారిశుఽధ్యం విషయంలో కొంత శ్రద్ధతో కొండంత ప్రగతి సాధించవచ్చని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్.నాగనరసింహారావు చెప్పారు. స్థానిక రాజీవ్ గృహకల్ప, 5వ సర్కిల్‌లో గురువారం పర్యటించిన ఆయన పారిశుధ్య

కార్పొరేషన్ (కాకినాడ), జూలై 8: పారిశుధ్యం విషయంలో కొంత శ్రద్ధతో కొండంత ప్రగతి సాధించవచ్చని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్.నాగనరసింహారావు చెప్పారు. స్థానిక రాజీవ్ గృహకల్ప, 5వ సర్కిల్‌లో గురువారం పర్యటించిన ఆయన పారిశుధ్య పనులను పరిశీలించారు. ఫైర్‌స్టేషన్, గోలీలపేట, జాలరిపేట, ఏటిమొగ ప్రాంతాల్లోని గార్బేజ్ వల్నరబల్ పాయింట్లను పర్యవేక్షించారు. ప్రతి ఇంటి నుంచి వ్యర్ధాల సేకరణతో పాటు వ్యర్ధాల ట్రాన్స్‌ఫర్ పాయింట్లను సందర్శించారు. 5వ సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, సంబంధిత సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.