నేటి నుంచి పాక్షిక కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-05T05:43:30+05:30 IST

పెద్దాపురం, మే 4: కొవిడ్‌ ఉధృతి రోజురోజుకూ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిందని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు తెలిపారు. స్థానిక విలేకర్లతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ

నేటి నుంచి పాక్షిక కర్ఫ్యూ

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 

12 గంటల వరకే వ్యాపారాలకు అనుమతి 

ఆర్డీవో మల్లిబాబు

పెద్దాపురం, మే 4: కొవిడ్‌ ఉధృతి రోజురోజుకూ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిందని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు తెలిపారు. స్థానిక విలేకర్లతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగిందని, పరిస్థితి ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను ఈనెల 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపార కార్యకలాలపాలను సాగించుకోవాలన్నారు. ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ తరచూ శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. బయటకు వెళితే కచ్చితంగా మాస్కు ధరించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే కొవిడ్‌ నియంత్రణ సాధ్యపడుతుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకే కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2021-05-05T05:43:30+05:30 IST