వైభవంగా కల్పవృక్ష వాహనసేవ

ABN , First Publish Date - 2021-11-02T06:52:48+05:30 IST

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా కల్పవృక్ష వాహనసేవ

ఆత్రేయపురం, నవంబరు 1: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టకలశారాధన, మహాస్నపనం, తోమాలసేవ, ప్రధాన హోమాలు, దుష్టగ్రహ దోష పరిహారార్ధం మహా సుదర్శన హోమం, చూర్ణోత్సవం, విశేషార్చనలను వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఘనంగా జరిపారు. స్వామి కల్యాణ మండపంలో కల్పవృక్ష వాహనంపై విహరించి భక్తులకు అభయహస్తం అందజేశారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు-హైమాపార్వతి దంపతులు, పంచాయతీరాజ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ వేణుగోపాల్‌ దంపతులతో పాటు దాతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  రాత్రి శ్రీవారు కల్కి అలంకరణలో మలయప్పస్వామి దర్శన మిచ్చారు. అశ్వ వాహనంపై పుర మాఢవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. 9వ రోజైన మంగళవారం మహా శాంతి హోమం, పూర్ణాహుతి, చక్రస్నానం, మహాదాశీర్వచనంలను వైభవంగా నిర్వహించి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు. 


Updated Date - 2021-11-02T06:52:48+05:30 IST