అధికార పార్టీ పెట్టే కేసులకు భయపడొద్దు
ABN , First Publish Date - 2021-02-01T06:04:24+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జనవరి 31: అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులకు భయపడొద్దని, పార్టీ శ్రేణులకు టీడీపీ అం డగా ఉంటుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్పారు. దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు

మాజీ ఎమ్మెల్యే కొండబాబు
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జనవరి 31: అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులకు భయపడొద్దని, పార్టీ శ్రేణులకు టీడీపీ అం డగా ఉంటుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్పారు. దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు మారుపిల్లి నల్లబ్బాయి సంతాప సభలో వనమాడి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కక్షపూరితం గా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై అక్రమ కేసు లు బనాయించి వేధిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు ఎండీ అన్సర్, అమన్‌జైన్, తుమ్మల రమేష్, వొమ్మి బాలాజీ, చోడిపల్లి స తీష్, ఎర్రబెల్లి రాము, మూగు రాజు, సింహాద్రి, రాజు పాల్గొన్నారు.