నల్ల దుస్తులతో నిరసన

ABN , First Publish Date - 2021-11-21T06:38:13+05:30 IST

శాసనసభలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణిపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాకినాడలో శనివారం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ శ్రే ణులు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు.

నల్ల దుస్తులతో నిరసన

కాకినాడ సిటీ, నవంబరు 20: శాసనసభలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణిపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాకినాడలో శనివారం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ శ్రే ణులు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. తొలుత జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టడానికి బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు, పిల్లలు ఉన్నారనే ఆలోచన జ్ఞానం కూడా ద్వారంపూడికి లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్ష, కార్యదర్శులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, కార్పొరేటర్లు, వనమాడి ఉమాశంకర్‌, పలివెల రవి, వొమ్మి బాలాజీ, తుమ్మల సునీత, గుజ్జు దుర్గ, నాయకులు ఎంఏ తాజుద్దీన్‌, బంగారు సత్యనారాయణ, కొల్లాబత్తుల అప్పారావు, సీకోటి అప్పలకొండ, చింతలపూడి రవి, అంబటి చిన్న, జోగా రాజు, రెడ్నం సత్తిబాబు, ఎండీ అన్సర్‌, హోతా రవి, మేడిశెట్టి చిన్ని, పార్లమెంట్‌ మహిళా ప్రధాన కార్యదర్శి చాపల ప్రశాంతి, నగర మహిళాధ్యక్షురాలు చిక్కాల సత్యవతి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T06:38:13+05:30 IST