‘టీడీపీ అభ్యర్థి వీరబాబు చర్యతో తీవ్ర దిగ్ర్భాంతి’

ABN , First Publish Date - 2021-11-10T05:28:36+05:30 IST

సర్పవరం జంక్షన్‌, నవంబరు 9: కాకినాడ మూడో డివిజన్‌ టీడీపీ అభ్యర్థి గుత్తుల వీరబాబు పార్టీ క్యాడర్‌ను నమ్మించి నామినేషన్‌ ఉపసంహరించుకోవడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. వాకలపూడిలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మూడో డివిజన్‌లో మంచి పట్టుందన్నారు. ఇక్కడ గడిచిన ఎన్నికల్లో

‘టీడీపీ అభ్యర్థి వీరబాబు చర్యతో తీవ్ర దిగ్ర్భాంతి’

సర్పవరం జంక్షన్‌, నవంబరు 9: కాకినాడ మూడో డివిజన్‌ టీడీపీ అభ్యర్థి గుత్తుల వీరబాబు పార్టీ క్యాడర్‌ను నమ్మించి నామినేషన్‌ ఉపసంహరించుకోవడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. వాకలపూడిలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మూడో డివిజన్‌లో మంచి పట్టుందన్నారు. ఇక్కడ గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. కార్పొరేటర్‌ గుత్తుల అచ్చియమ్మ మృతితో ఆమె కుమారుడు వీరబాబుకు స్థానిక నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు టిక్కెట్‌ ఇచ్చి అట్టహాసంగా నామినేషన్‌ వేసి నాలుగు రోజులుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నామన్నారు. నామినేషన్‌ చివరి రోజు ఉదయం 11.20 గంటలకు పోటీ నుంచి తప్పుకోగా, ఆర్వోను అడిగితే సాయంత్రం వరకు చెప్పకపోవడం దారుణమన్నా రు. అభ్యర్థి వీరబాబు స్వయంగా వచ్చి నామినేషన్‌ ఉపసంహరించుకున్నాడా, లేదంటే ఎక్కడో ఒక చోట అధికార పార్టీ ప్రోద్బలం, ప్రలోభాలతో ఎన్నికల బరినుంచి తప్పుకున్నాడో అన్న సంగతి అతడి ఆచూకీ తెలిస్తే గాని వివరాలు తెలియవన్నారు. వీరబాబు చర్యతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నైతిక బాధ్యత తమదేనన్నారు.

Updated Date - 2021-11-10T05:28:36+05:30 IST