‘డేటా సేకరణ వేగవంతం చేయాలి’

ABN , First Publish Date - 2021-10-30T05:29:06+05:30 IST

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 29: గృహ నిర్మాణశాఖ ఆర్థిక సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల డేటా సేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని కాకినాడ ఆర్డీవో ఏజీ. చిన్నికృష్ణ ఆదేశించారు. శుక్రవారం సర్పవరం జంక్షన్‌లో మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో

‘డేటా సేకరణ వేగవంతం చేయాలి’
వీఆర్వోలతో సమీక్ష నిర్వహిస్తున్న ఆర్డీవో చిన్నికృష్ణ

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 29: గృహ నిర్మాణశాఖ ఆర్థిక సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల డేటా సేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని కాకినాడ ఆర్డీవో ఏజీ. చిన్నికృష్ణ ఆదేశించారు. శుక్రవారం సర్పవరం జంక్షన్‌లో మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఇన్‌చార్జి తహశీల్ధార్‌ వీరవల్లి మురార్జీ అధ్యక్షతన జగనన్న సంపూర్ణ గృహ హక్కు (జేఎ్‌సజీహెచ్‌) పథకంపై వీఆర్వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ సంపూర్ణ గృహహక్కు పథకంలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌) ద్వారా లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 1983 నుంచి 2011 మధ్యలో హౌసింగ్‌ సహకారంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల జాబితాలను పరిశీలించాలన్నారు. ఇందులో లబ్ధిదారులు, వారసులు, ఇతరులను గుర్తించాలని ఆదేశించారు. వీరికి సంపూర్ణ హక్కు పథకంలో ఓటీఎ్‌సపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ పథకం ప్రయోజనాలు వివరించి ఓటీఎస్‌ పథకంలో ప్రభుత్వం నిర్దేశించిన రూ.10వేలు ఫీజు చెల్లించడం ద్వారా నివాస ప్రాంతంపై సంపూర్ణ హక్కులు లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి డాక్యుమెంట్‌ను ప్రభుత్వం జారీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల డేటా సేకరించే సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో కేటగిరీల వారీగా లబ్ధిదారులతో రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో తెలిపారు. సమావేశంలో ఆర్‌ఐ వై.శ్రీనివాస్‌, వీఆర్వోలు నున్న సత్యనారాయణ, కేవీ సత్యనారాయణ, నాగేంద్ర, రెడ్డి, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:29:06+05:30 IST