సమగ్ర భూసర్వే వివరాలను అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2021-12-28T05:32:51+05:30 IST

పిఠాపురం, డిసెంబరు 27: సమగ్ర భూసర్వేలో గుర్తించిన అన్ని వివరాలను పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. పిఠాపురం పట్టణ శివారు ఇల్లింద్రాడలో జరుగుతున్న సమగ్ర భూసర్వేను ఆయన సోమవారం పరిశీలించారు. సర్వే జరిగిన తీరుని,

సమగ్ర భూసర్వే వివరాలను అందుబాటులో ఉంచాలి
ఇల్లింద్రాడలో భూసర్వేను పరిశీలిస్తున్న ఆర్డీవో

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ

పిఠాపురం, డిసెంబరు 27: సమగ్ర భూసర్వేలో గుర్తించిన అన్ని వివరాలను పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. పిఠాపురం పట్టణ శివారు ఇల్లింద్రాడలో జరుగుతున్న సమగ్ర భూసర్వేను ఆయన సోమవారం పరిశీలించారు. సర్వే జరిగిన తీరుని, సర్వే రాళ్లు  పాతిన అంశాలను తనిఖీ చేశారు. ఆయన వెంట తహశీల్దార్‌ వరహాలయ్య, సర్వేయర్‌ సత్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - 2021-12-28T05:32:51+05:30 IST