డంపర్‌ బిన్‌ ఫ్రీ నగరంగా కాకినాడ

ABN , First Publish Date - 2021-02-26T05:36:38+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: డంపర్‌ బిన్‌ ఫ్రీ నగరంగా కాకినాడను తీర్చిదిద్దనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలి పారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఒకటో సర్కిల్‌ పరిధిలో కమిషనర్‌ పర్యటించి గురువారం పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆ ప్రాంతంలో

డంపర్‌ బిన్‌ ఫ్రీ నగరంగా కాకినాడ
పారిశుధ్య పనులు పరిశీలిస్తున్న కమిషనర్‌ స్వప్నిల్‌

కమిషనర్‌ స్వప్నిల్‌ 

కార్పొరేషన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: డంపర్‌ బిన్‌ ఫ్రీ నగరంగా కాకినాడను తీర్చిదిద్దనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలి పారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఒకటో సర్కిల్‌ పరిధిలో కమిషనర్‌ పర్యటించి గురువారం పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని డంపర్‌ బిన్‌ల్లో చెత్తవేయకుండా పారిశుధ్య కార్మికులకు అందించడం ద్వారా మెరుగైన పాయింట్లు లభిస్తాయన్నారు. ఒకటో సర్కిల్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి మూడో డివిజన్‌లో డంపర్‌ బిన్‌ ఫ్రీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇకపై డంపర్‌ బిన్‌లు ఉండనందున చెత్త వేస్తే అపరాధ రుసుం, రిటర్న్‌ గిఫ్ట్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని కమిషనర్‌ ప్రకటించారు.

Updated Date - 2021-02-26T05:36:38+05:30 IST