అభిమానితో మాట్లాడిన జూనియర్‌ ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2021-10-07T05:49:14+05:30 IST

రాజోలుకు చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని కొప్పాడి మురళి ఇటీవల ప్రమాదానికి గురై విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అభిమానితో మాట్లాడిన జూనియర్‌ ఎన్టీఆర్‌

మామిడికుదురు, అక్టోబరు 6: రాజోలుకు చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని కొప్పాడి మురళి ఇటీవల ప్రమాదానికి గురై విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడు తాను ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌ను కలవాలని డాక్టర్లకు చీటీ రాసి చూపించాడు. ఈవిషయాన్ని డాక్టర్లు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ జిల్లా అధ్యక్షుడు రాయుడు బాబ్జీ, భాస్కర్‌ చౌదరిలకు తెలియజేయడంతో వారు ఎన్టీఆర్‌కు తెలిపారు. వెంటనే ఎన్టీఆర్‌ వీడియో కాల్‌ చేసి పరామర్శించడంతో మురళి పొంగిపోయాడు. మూడు నెలల్లో సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తానని ఎన్టీఆర్‌కు వివరించాడు.

Updated Date - 2021-10-07T05:49:14+05:30 IST