బియ్యం ఎగుమతుల సామర్థ్యం పెంచాలి: జేసీ లక్ష్మీశ

ABN , First Publish Date - 2021-01-13T06:25:24+05:30 IST

కాకినాడ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశాలకు కాకినాడ నుంచి జల రవాణా ద్వారా ఎగుమతులు జరిగే విషయంలో ఒకప్పుడు యాంకరేజీ పోర్టుకు అధిక ప్రాధాన్యం ఉండేదని, తిరిగి అదే ప్రాధాన్యం సంతరించుకునేలా ఎగుమతుల సామర్థ్యం పెంచాలని జేసీ లక్ష్మీశ ఎగుమతి

బియ్యం ఎగుమతుల   సామర్థ్యం పెంచాలి: జేసీ లక్ష్మీశ
ఎగుమతిదారులతో చర్చిస్తున్న జేసీ లక్ష్మీశ

కాకినాడ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశాలకు కాకినాడ నుంచి జల రవాణా ద్వారా ఎగుమతులు జరిగే విషయంలో ఒకప్పుడు యాంకరేజీ పోర్టుకు అధిక ప్రాధాన్యం ఉండేదని, తిరిగి అదే ప్రాధాన్యం సంతరించుకునేలా ఎగుమతుల సామర్థ్యం పెంచాలని జేసీ లక్ష్మీశ ఎగుమతిదారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అధ్యక్షతన బియ్యం ఎగుమతిదారుల అసోసియేషన్‌ ప్రతినిధులతో చర్చించారు. జేసీ మాట్లాడుతూ యాంకరేజీ పోర్టు ద్వారా ప్రతీ ఏడాది సుమారు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి జరుగుతుందని, దీన్ని 40 నుంచి 50 లక్షల మెట్రిక్‌ ట న్నుల వరకు పెంచేలా ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా సామర్థ్య, సదుపాయాలు సరిపోకపోతే డీప్‌ వాటర్‌ పోర్టు వినియోగించుకునేలా అక్కడున్న వసతులకు సంబంధించి ని ర్దిష్టమైన ప్రణాళిక ఇవ్వాలన్నారు. యాంకరేజీలో ఉదయం మాత్రమే లోడింగ్‌ చేస్తున్నారని, కార్మికుల సంఖ్య పెంచి రాత్రి వేళల్లో కూడా లోడింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి అవసరమైన వెసులుబాటు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ బుల్లిరాణి, కాకినాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ వీవీ రాఘవులు, బియ్యం ఎగుమతిదారుల అసోసియేషన్‌ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు, సభ్యులు డి.వీరభద్రారెడ్డి, వినోద్‌ అగర్వాల్‌, దంటు భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T06:25:24+05:30 IST