జేఎన్టీయూకేలో పలు విభాగాలకు అధికారుల నియామకం

ABN , First Publish Date - 2021-12-16T05:17:15+05:30 IST

జేఎన్టీయూకే, డిసెంబరు 15: జేఎన్టీయూకేలో ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు ఆదేశాల మేరకు పలువురు అధికారులను నియమిస్తూ రిజిస్ర్టార్‌ ఎల్‌.సుమలత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ అలూమ్ని రిలేషన్స్‌ సెల్‌ ప్రత్యేకాధికారిగా మోహన్‌రావు, స్కిల్‌, వెబ్‌ డెవల్‌పమెం

జేఎన్టీయూకేలో పలు విభాగాలకు అధికారుల నియామకం

జేఎన్టీయూకే, డిసెంబరు 15: జేఎన్టీయూకేలో ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు ఆదేశాల మేరకు పలువురు అధికారులను నియమిస్తూ రిజిస్ర్టార్‌ ఎల్‌.సుమలత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ అలూమ్ని రిలేషన్స్‌ సెల్‌ ప్రత్యేకాధికారిగా మోహన్‌రావు, స్కిల్‌, వెబ్‌ డెవల్‌పమెంట్‌, డిజిటల్‌ మోనిటరింగ్‌ సెల్‌ ప్రత్యేకాధికారిగా చక్రవర్తి, ఫార్మసీ కోర్సుల ప్రత్యేకాధికారిగా జీవీఎ్‌సఆర్‌ దీక్షితులు, యూసీఈకే వైస్‌ ప్రిన్సిపాల్‌గా రత్నకుమారి, యూసీఈకే సివిల్‌ విభాగ బీవోఎస్‌ చైర్‌పర్సన్‌గా మురళీకృష్ణ, మెకానికల్‌ విభాగ బీవోఎస్‌ చైర్‌పర్సన్‌గా గోపాలకృష్ణ, ఈఈఈ విభాగ బీవోఎస్‌ చైర్‌పర్సన్‌గా నరసింహమూర్తి, సీఎ్‌సఈ విభాగ బీవోఎస్‌ చైర్‌పర్సన్‌గా కృష్ణప్రసాద్‌, ఈసీఈ విభాగ బీవోఎస్‌ చైర్‌పర్సన్‌గా ఏఎం ప్రసాద్‌ను నియమించినట్టు రిజిస్ర్టార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-16T05:17:15+05:30 IST