జేఎన్టీయూకే వీసీగా బాధ్యతలు చేపట్టిన రామలింగరాజు

ABN , First Publish Date - 2021-07-12T05:30:00+05:30 IST

ఏపీ గవర్నర్‌, జేఎన్టీయూకే ఛాన్స్‌లర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ సుప్రీమ్‌కోర్టు తీర్పునుఅనుసరించి జేఎన్టీయూకే వీసీగా ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజును తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.

జేఎన్టీయూకే వీసీగా బాధ్యతలు చేపట్టిన రామలింగరాజు

  జేఎన్టీయూకే,జూలై12: ఏపీ గవర్నర్‌, జేఎన్టీయూకే ఛాన్స్‌లర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ సుప్రీమ్‌కోర్టు తీర్పునుఅనుసరించి జేఎన్టీయూకే వీసీగా ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజును తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. ఈమేరకు సోమవారం ఉదయం రామలింగరాజు ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరిసహకారంతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషిచేసి ప్రగతిపధంలో నడిపిస్తానని తెలిపారు. ఆయనను వర్శిటీ డైరెక్టర్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

Updated Date - 2021-07-12T05:30:00+05:30 IST