‘మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు’

ABN , First Publish Date - 2021-12-04T05:23:40+05:30 IST

ఉప్పాడ (కొత్తపల్లి), డిసెంబరు 3: జవాద్‌ తుపాన్‌ కారణంగా తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లరాదని కాకినాడ ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ సూచి ంచారు. తీరప్రాంత గ్రామాలైన ఉప్పాడ, సుబ్బంపేట, మూ లపేట, కోనపాపపేటల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. తుపాన్‌ తీరం దాటే సమయంలో ఈదులుగాలులు వీస్తామని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారు

‘మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు’

ఉప్పాడ (కొత్తపల్లి), డిసెంబరు 3: జవాద్‌ తుపాన్‌ కారణంగా తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లరాదని కాకినాడ ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ సూచి ంచారు. తీరప్రాంత గ్రామాలైన ఉప్పాడ, సుబ్బంపేట, మూ లపేట, కోనపాపపేటల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. తుపాన్‌ తీరం దాటే సమయంలో ఈదులుగాలులు వీస్తామని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు రెండురోజుల పాటు వేట చేయవద్దని ఆదేశించారు. ఈదురుగాలులకు కెరటాలు ఎగసిపడి మత్స్యకారుల ఇళ్లల్లోకి దూసుకొనిపోయే ప్రమాదం ఉందని, ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాని ఆయన కోరారు. తుపాన్‌ తీరందాటే వరకు తీరప్రాంత గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్డీవో వెంట కొత్తపల్లి తహశీల్దార్‌ ఎల్‌శివకుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-04T05:23:40+05:30 IST