జాతీయ రహదారిపై ఆక్రమణలు
ABN , First Publish Date - 2021-12-31T06:03:41+05:30 IST
జగ్గంపేట, డిసెంబరు 30: నియోజకవర్గంలో భూకబ్జదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లేఅవుట్లు వేసి జాతీయ రహదారిని ఆక్రమించేసి డ్రైన్లు, పిల్ల కాలువలను మూసివేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... మెట్టప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 30 కిలోమీటర్ల మేర

జగ్గంపేట నియోజవర్గంలో ఎక్కువవుతున్న లేఅవుట్లు
మూసుకుపోతున్న డ్రైన్లు, పిల్ల కాలువలు
జగ్గంపేట, డిసెంబరు 30: నియోజకవర్గంలో భూకబ్జదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లేఅవుట్లు వేసి జాతీయ రహదారిని ఆక్రమించేసి డ్రైన్లు, పిల్ల కాలువలను మూసివేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... మెట్టప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 30 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. దీన్ని ఆనుకొని ఉన్న ఇరువైపుల భూములను రియల్‌ఎస్టేటర్లు, దళారులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. సొమ్ములు చేసుకోవడానికి కొన్న భూములను లేఅవుట్లుగా (ఇళ్ల స్థలాలు) అధికార, అనాధికారికంగా తయారుచేస్తున్నారు. నియోజకవర్గంలోని ఎగువభాగంలో ఏజెన్సీ ప్రాంతంతో పాటు వాగులు, చెరువులు, ఏలేరు నుంచి వచ్చే మిగులు జలాల నీరు జాతీయ రహదారిని దాటుకుని దిగువ భాగంలోకి చేరుకోవలసి ఉంది. అయితే గత రెండేళ్లుగా జాతీయ రహదారి పక్కన భూములను లేఅవుట్లుగా మార్చేస్తుండడంతో పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధించిన పంటకాలువలు, డ్రైన్లు, ఆయకట్టు చెరువు కాలువలను పూ డ్చివేస్తున్నారు. దీంతో అధిక వర్షాల కురినప్పుడు పొలాలు, ఇళ్లు నీట మునిగిపోతున్నాయ. ప్రధాన కాలువల నుంచి వచ్చే అదనపునీరు వెళ్లే మార్గాలను భూకబ్జాదారులు లేఅవుట్లతో మూసివేయడంతో నియోజవర్గంలో జాతీయ రహదారి పాడైపోతుంది. ఈ ఆక్రమణలపై గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల ప్రజలు, బీజేపీ, టీడీపీ, జనసేన, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీసంఘం నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి అధికారులకు వినపతిపత్రాలు అందజేసినా స్పందించడంలేదని తెలుస్తోంది. ఇప్పటి కైనా జాతీయ రహదారి ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు విస్తరణలో భాగంగా వారు తీసుకున్న భూమిని కొలతలు వేయించి స్వాధీనంలోకి తెచ్చుకోవాలని, డ్రైన్లకు నీరుపోయే మార్గాలను సుగమం చేయాలని నాయకులు, ప్రజలు కోరుతున్నారు.