పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-07-13T05:28:26+05:30 IST

జగ్గంపేట, జూలై 12: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జగ్గంపేటలో సోమవారం ఆందోళన నిర్వహించారు. రావులమ్మ తల్లి ఆలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ఎడ్ల బండిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. హైవేపై రాస్తారోకో

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
జగ్గంపేటలో నిరసన తెలియజేస్తున్న కాంగ్రె స్‌ నాయకులు

జగ్గంపేటలో కాంగ్రెస్‌ నాయకుల నిరసన

జగ్గంపేట, జూలై 12: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జగ్గంపేటలో సోమవారం ఆందోళన నిర్వహించారు. రావులమ్మ తల్లి ఆలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ఎడ్ల బండిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. హైవేపై రాస్తారోకో నిర్వహించి పెట్రోల్‌ బంకు వద్ద వాహనదారుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాధారణ, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా నిత్యావసర ధరలను పెంచుతోందని మండిపడ్డారు. ప్రజలు బీజేపీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చిలుకూరి పాండురంగారావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లిపూడి రాంబాబు, నాయకులు ఉమ్మిడి వెంకటరావు, అమర్‌నుర్‌ బేగం, మేడిద శ్రీనివాసరావు, కోలా ప్రసాద్‌ వర్మ, మరోతి శివగణేష్‌, ముళ్లపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:28:26+05:30 IST