జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదిలేదు
ABN , First Publish Date - 2021-10-22T05:28:04+05:30 IST
రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనితనంతో టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరు కునేది లేదని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు.

చర్యకు ప్రతిచర్య ఉంటుంది
మంత్రి కన్నబాబు హెచ్చరిక
సర్పవరం జంక్షన్, అక్టోబరు 21: రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనితనంతో టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరు కునేది లేదని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. సీఎంపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సర్పవరం జంక్షన్లో వైసీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబుకు దక్కాల్సిన పదవి సీఎం జగన్ తన్నుకుపోయినట్లు ఈర్ష్య, బాధ, అక్రోశంతో టీడీపీ అండ్ కో రగిలిపోతోందన్నారు. పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడిన భాష దారుణంగా ఉందన్నారు. అక్రమ గంజాయిపై బురదజల్లుతోన్న చంద్రబాబుకు, పార్టీ నాయకులకు ఇంగితజ్ఞానం లేదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. జడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యా ళ్ల సుబ్బారావు, ఎంపీపీ గోపిశెట్టి పద్మజాగోపీ, ఏఎంసీ ఛైర్మన్ గీసాల శ్రీను, పార్టీ నాయకులు సంగాడి మోషె, పాలిక నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ లబ్థి కోసమే: ఎమ్మెల్యే దొరబాబు
పిఠాపురం: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పె ట్టి రాజకీయ లబ్థిపొందాలని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు, చంద్రబాబు కుటిల యత్నాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో గురువారం పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో జనాగ్రహ దీక్ష నిర్వహించారు. దీక్షలో జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ బుర్రా అనుబాబు, జడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల నాగలోవరాజు పాల్గొన్నారు.
అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు : ఎమ్మెల్యే పర్వత
ప్రత్తిపాడు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి దిగజారుడు మాటలతో విమర్శలు చేస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్ర సాద్ విమర్శించారు. స్థానిక మెయిన్‌రోడ్డులో గురువారం నిర్వహించిన జనాగ్రహ దీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ నేతల తీరును దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు బెహరా రాజరాజేశ్వరి, గొల్లు చిన్నదివానం, ఎంపీపీలు జీకే సుధాకర్, గొల్లపల్లి బుజ్జి, పర్వత రాజబాబు, రాజ్యలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
తుని: స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో నిర్వహించి న జనాగ్రహ దీక్షలో ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ టీడీపీ నేతలు ముఖ్య మంత్రి జగన్‌పై దుర్భాషలాడుతున్నారని, ప్రజలు తీవ్రంగా ఖండించాలన్నారు. వైసీపీ నేతలు మోతుకూరి వెంకటేష్, పోతల లక్ష్మణ్, కొయ్యా మురళీకృష్ణ, పోతల రమణ, బొప్పన రాము, లగుడు శ్రీను, చోడిశెట్టి పెద్ద, రేలంగి రమణగౌడ్ పాల్గొన్నారు.
పెద్దాపురం: సీఎం జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. మునిసి పల్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రికి తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీమంగతాయారు. వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, ఎంపీపీ పెంకే సత్యవతి, జడ్పీటీసీ సూరిబాబు పాల్గొన్నారు.
గోకవరం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలుచేసిన టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్చే యడంతో పాటు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కోరుతూ గురువారం గోకవరంలో వైసీపీ నాయకులు ప్రజాగ్రహ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాసరి రమేష్, గాంజింగం సత్తిబాబు, వరసాల ప్రసాద్, కర్రి సూరారెడ్డి, శుంకర వీరబాబు పాల్గొన్నారు.
కిర్లంపూడి: కిర్లంపూడిలో ఏర్పాటుచేసిన జనాగ్రహ దీక్షా శిబిరాన్ని కిర్లంపూడి సొసైటీ చైర్మన్ చదలవాడ బా బి, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు సందర్శించా రు. వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు దోమల గంగాధర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షా శిబిరానికి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ పాల్గొన్నారు.