గ్రామంలోనే స్థలాలు కేటాయించాలని నిరసన

ABN , First Publish Date - 2021-02-06T07:07:12+05:30 IST

పెదపట్నం గ్రామంలోనే ఇళ్ల స్థలాలు కేటా యించాలని గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

గ్రామంలోనే స్థలాలు కేటాయించాలని నిరసన

మామిడికుదురు, ఫిబ్రవరి 5: పెదపట్నం గ్రామంలోనే ఇళ్ల స్థలాలు కేటా యించాలని  గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం  తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. 90మంది లబ్ధిదారులకు పది కిలో మీటర్ల దూరంలోని పాశర్లపూడిలంకలో స్థలాలు కేటాయించడం దారు ణమన్నారు. వేరే గ్రామంలో కేటాయించిన స్థలాలు తమకు అక్కర్లేదన్నారు. వినతిపత్రాన్ని తహశీల్దార్‌ కార్యాలయంలో అందించారు. ఉచ్చుల దుర్గాలక్ష్మి, గాలి వరలక్ష్మి, మొల్లేటి కనకదుర్గ, బొక్కా అనంతలక్ష్మి   పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T07:07:12+05:30 IST