రాష్ట్రంలో ప్రజా జీవితాలు అస్తవ్యస్తం: గొల్లపల్లి

ABN , First Publish Date - 2021-12-25T06:03:59+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాలు అస్తవ్యస్తమై పోయాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

రాష్ట్రంలో ప్రజా జీవితాలు అస్తవ్యస్తం: గొల్లపల్లి

మలికిపురం, డిసెంబరు 24: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాలు అస్తవ్యస్తమై పోయాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. టీడీపీ సాంస్కృతిక విభాగం అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరాజు ఇంటి వద్ద శుక్రవారం జరిగిన సమావేశంలో గొల్లపల్లి మాట్లా డుతూ రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ఎస్సీ, బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఓటీఎస్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సమావే శంలో అడబాల సాయిబాబు, రాపాక నవరత్నం, పిండి సత్యనారాయణ, చాగంటి స్వామి, తాడి సత్యనా రాయణ, గోనిపాటి రాజు, అంతర్వేదిపాలెం పుల్లయ్య, కడలి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-25T06:03:59+05:30 IST