కాలువలో పడి వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-12-28T06:09:19+05:30 IST

కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన 22ఏళ్ల వివాహిత పాలెపు మంగాదేవి కాలువలో పడి మృతిచెందింది.

కాలువలో పడి వివాహిత మృతి

వివాహం జరిగిన రెండు నెలలకే దుర్మరణం

కపిలేశ్వరపురం, డిసెంబరు 27: కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన 22ఏళ్ల వివాహిత పాలెపు మంగాదేవి కాలువలో పడి మృతిచెందింది. ఆమె ఆదివారం తెల్లవారుజామున దుస్తులు పట్టుకుని కాలువరేవు వద్దకు వెళ్లి తిరిగి రాలేదంటూ ఆమె తల్లి కర్రి నూకరత్నం అదేరోజు అంగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కె.గంగవరం మండలం కూళ్ల వద్ద ఆమె మృతదేహం సోమవారం లభ్యమైంది. అదే గ్రామానికి చెందిన పాలెపు దుర్గాప్రసాద్‌తో రెండు నెలల క్రితం ఆమెకు వివాహమైంది. మృతికిగల కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపారు.  


Updated Date - 2021-12-28T06:09:19+05:30 IST