మంచు తెరలు.. చలిగాలులు!

ABN , First Publish Date - 2021-12-26T06:40:02+05:30 IST

చలి తీవ్రత పెరిగింది. దీనికితోడు దట్టంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు.

మంచు తెరలు.. చలిగాలులు!
సామర్లకోట ఏడీబీ రోడ్డులో శనివారం తెల్లవారుజామున మూసేసిన పొగ మంచు

పెరిగిన చలితో జనం గజగజ

దట్టమైన మంచుతో రహదారుల్లో పాట్లు

కరప/సామర్లకోట, డిసెంబరు 25: చలి తీవ్రత పెరిగింది. దీనికితోడు దట్టంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. బారెడు పొద్దెక్కినా జనం ఇళ్లల్లోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మంచు తెరలుతెరలుగా పడుతుండడంతో రహదారులు కనిపించడం లేదు. ఎదురుగా ఎవరున్నారో కూడా తెలియని స్థాయిలో మంచు కురుస్తోంది. ఉదయం 7 గంటల వరకు దట్టంగా మంచు అలుముకోవడంతో దారి కనపడక లైట్ల వెలుతురులో వాహనదారులు తమ వాహనాలను నడుపుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు చలిమంటలు వేసుకుని తమ శరీరాలను వెచ్చపరుచుకుంటున్నారు. మరోపక్క కనువిందుచేస్తున్న మంచు దృశ్యాలను చూసి ప్రకృతి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. గత మూడు రోజులుగా మంచుతో పొగలు అలుముకోవడంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపిం చకపోవడంతో వాహనాలకు హెడ్‌లైట్లను ఆన్‌చేసి స్పీడ్‌ తగ్గించి నడిపారు. శుక్రవారం రాత్రి ఈ పొగ మంచు మరింత పెరిగింది. అటు చలి గాలుల కారణంగా దాళ్వా సాగుకు వేసిన విత్తనాలు మొలకెత్తడంలో జాప్యం అయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. తేమశాతం తగ్గేందుకు ఆర బోసిన ధాన్యానికీ ఈ మంచు ఇబ్బంది కలిగిస్తోందని చెబుతున్నారు.

Updated Date - 2021-12-26T06:40:02+05:30 IST