ఇళ్ల స్థలాలు పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2021-08-27T06:09:34+05:30 IST

: మండలంలోని మల్లేపల్లి, గండేపల్లి, ఉప్పలపాడు గ్రామాల్లో జగనన్న నవరత్నా ల్లో భాగంగా పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను గురువారం జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పరిశీలించారు.

ఇళ్ల స్థలాలు పరిశీలించిన జేసీ

గండేపల్లి, ఆగస్టు 26: మండలంలోని మల్లేపల్లి, గండేపల్లి, ఉప్పలపాడు గ్రామాల్లో జగనన్న నవరత్నా ల్లో భాగంగా పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను గురువారం జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పరిశీలించారు. ఆ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు పోలవరం గట్టుపై ఇవ్వ డంతో ఆ ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవడానికి అను కూలంగా లేక పలువురు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించు కునేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఆ స్థలాలను జేసీ పరిశీలించి ఇళ్లు కట్టుకు నేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ చిన్నారావు, ఆర్‌ఐ నాగేశ్వరరావు, వీఆర్వో వెంకటేష్‌, సర్వేయర్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

మల్లిశాలలో బంగాళా పొలం పరిశీలన

జగ్గంపేటరూరల్‌, ఆగస్టు 26: మండలంలోని మల్లిశాల గ్రామంలో  ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్లస్థలాల కోసం స్థలాన్ని పరిశీలించారు. గతంలో అధికారులు నిర్ణయించిన స్థలం మాకు వద్దంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విధితమే. అందువల్ల జాయింట్‌కలెక్టర్‌ స్వయంగా వచ్చి గ్రామానికి సమీపంలో ఉన్న బంగాళా పొలాన్ని పరిశీలించారు. ఈ పొలం 7 ఎకరాలు అయినప్పటికీ ప్రైవేట్‌ది కావడంతో ఈ సందర్భంగా స్థానిక అధికారుల నుంచి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుని తదుపరి ఆమోదముద్ర వేసేందుకు కసరత్తు ప్రారంభించారు. గ్రామంలో 208 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకోసం ఎదురుచూస్తున్నారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్‌డీవో మల్లిబాబు, జగ్గంపేట తహశీల్ధార్‌ వై.సరస్వతి, గ్రామ సర్పంచ్‌ సర్వసిద్ది నూకరత్నం, మండల గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-27T06:09:34+05:30 IST