సంపూర్ణ గృహ హక్కు పథకంపై రసాభాస

ABN , First Publish Date - 2021-11-28T06:16:47+05:30 IST

రెండు దశాబ్దాల క్రితం గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను క్రమ బద్ధీకరణ పేరుతో వెంటనే తిరిగి చెల్లించాలని ఒత్తిళ్లు తేవడం ఎంతవరకు సమంజసమని టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ప్రశ్నించారు.

సంపూర్ణ గృహ హక్కు పథకంపై రసాభాస

అధికార, విపక్ష కౌన్సిలర్ల తీవ్ర వాగ్వివాదం

అమలాపురం టౌన్‌, నవంబరు 27: రెండు దశాబ్దాల క్రితం గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను క్రమ బద్ధీకరణ పేరుతో వెంటనే తిరిగి చెల్లించాలని ఒత్తిళ్లు తేవడం ఎంతవరకు సమంజసమని టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ప్రశ్నించారు. కొవిడ్‌, నిత్యావసరాల ధరల పెరు గుదులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలు ఇప్పటి కిప్పుడు ఆ సొమ్ములు ఎలా చెల్లిస్తారని టీడీపీ కౌన్సిలర్‌ అబ్బిరెడ్డి చంటి ప్రశ్నించారు. ఆయనకు విపక్ష కౌన్సిలర్లు అంతా సంఘీభావం తెలిపారు. ఒక దశలో వైసీపీ కౌన్సి లరు బండారు గోవిందు కల్పించుకోవడంతో ఒక్కసారిగా సమావేశం అధికార, విపక్ష కౌన్సిలర్ల అరుపులు, కేకలతో దద్దరిల్లింది.  అమలాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం శనివారం నాలుగు ఎజెండా అంశాలతో చైర్‌ పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన జరిగింది. జగ నన్న సంపూర్ణ భూహక్కు పథకానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఆరు లక్షల మంది గృహనిర్మాణ రుణాలు తీసుకోగా నాలుగు లక్షల మందిని ఇప్పటికే గుర్తించామని మున్సిపల్‌ కమిషనర్‌  వి.అయ్యప్పనాయుడు తెలిపారు. డిసెంబరు 15వరకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గడువు ఇచ్చిందని, ఎవరిపైనాఒత్తిడి తేవడంలేదన్నారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించి ఆక్రమణలను తొలగించాలని పలువురు  సభ్యులు సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించేందుకు నిర్ణయించారో తెలపాలని అధికార పక్ష కౌన్సిలర్‌ గొవ్వాల రాజేష్‌ ప్రశ్నిం చారు. ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ, మున్సి పల్‌ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న ప్రాంతా లపై దృష్టి సారించామని కమిషనర్‌ తెలిపారు. ఆక్రమ ణల తొలగింపులో ఏ కౌన్సిలర్‌ కల్పించుకోరని అయితే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారపక్ష నేత మట్ట పర్తి నాగేంద్ర సూచించారు. పట్టణంలో పందుల స్వైర విహారం, కుక్కల బెడద తదితర అంశాలపై టీడీపీ కౌన్సి లర్లు ఆశెట్టి నాగదుర్గ, బొర్రా వెంకటేశ్వరరావులు పలు ప్రశ్నలు సంధించారు. పట్టణంలో విచ్చల విడిగా రోడ్డుపై వదిలేసిన గోవులను తరలించేం దుకు అవసర మైతే బందెల దొడ్లు నిర్మిస్తామని కమిషనర్‌ తెలిపారు. 25వవార్డులో ప్రభుత్వ స్థలం ఆక్రమణపై మరోసారి ఆ వార్డు కౌన్సిలరు దొంగ నాగసుధారాణి ప్రశ్నించి చైర్‌ పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈఅంశం హైకోర్టు పరిధిలో ఉన్నం దున ఏదైనా కోర్టులోనే తేల్చుకోవలసి ఉంటుందని కమిషనర్‌ తెలిపారు. మున్సిపల్‌ పాఠశాలల విద్యా ర్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను ఎం దుకు నిలుపుదల చేశారని జనసేన కౌన్సిలర్‌ పిండి అమరావతి ప్రశ్నించారు. అనధికార లేఅవుట్ల అంశాన్ని కౌన్సిలర్‌ గొవ్వాల రాజేష్‌ ప్రశ్నించారు. మార్కెట్‌ ఏరి యాలో ప్రహరీ నిర్మాణం కోసం తీర్మానం చేసినా ఎందు కు నిర్మించడంలేదని వార్డు కౌన్సిలర్‌ యండమూరి గంగ ప్రశ్నించారు. అదే సమయంలో ఆ వార్డుకు చెందిన ప్రజలు కౌన్సిల్‌ హాలు ఎదుట నినాదాలు చేస్తూ వెంటనే గోడ నిర్మించాలని డిమాండు చేశారు. కాంట్రాక్టర్లకు దశలవారీగా బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని సభ్యులు అడిగిన ప్రశ్నలకు  సమాధాన మిచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు చిక్కాల రాంబాబు, సుంకర పార్వతి, వాసర్ల లక్ష్మి, దొమ్మేటి పరశురాముడు, సంసాని వెంకటచంద్రశేఖర్‌   పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-28T06:16:47+05:30 IST