గృహ పథకం సద్వినియోగంతో సర్వహక్కులు: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-12-25T05:43:40+05:30 IST

నిరుపేదలకు సంపూర్ణ గృహ హక్కు పథకం ఒక వరమని, రుణమాఫీతోపాటు నివేశిత స్థలానికి రిజిస్ట్రేషన్‌తో సర్వహక్కులను ప్రభుత్వం కల్పిస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు కోరారు.

గృహ పథకం సద్వినియోగంతో సర్వహక్కులు: మంత్రి కన్నబాబు

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 24: నిరుపేదలకు సంపూర్ణ గృహ హక్కు పథకం ఒక వరమని, రుణమాఫీతోపాటు నివేశిత స్థలానికి రిజిస్ట్రేషన్‌తో సర్వహక్కులను ప్రభుత్వం కల్పిస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు కోరారు. సర్పవరం జంక్షన్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం(ఓటీఎస్‌)లో లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను ఎంపీపీ గోపిశెట్టి పద్మజా, జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణలతో కలసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 31వేలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. హౌసింగ్‌ రుణం లేకుండా ప్రభుత్వ పట్టాతో ఇళ్లు నిర్మించుకున్న 4,181 మందికి రూ.10కే రిజిస్ట్రేషన్‌ చేయించే ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో మేయర్‌ సుంకర శివప్రసన్న, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్‌ గీసాల శ్రీను, తహశీల్ధార్‌ వి.ము రార్జీ, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, వైసీపీ నాయకులు జమ్మలమడక నాగమణి, పుల్ల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

పేదలకు ఆస్తిపై సంపూర్ణ హక్కులు : ఎమ్మెల్యే దొరబాబు 

గొల్లప్రోలు రూరల్‌: ప్రభుత్వం ద్వారా ఇళ్లపట్టాలు, గృహా రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ఓటీఎస్‌ ద్వారా వారి ఆస్తి ద్వారా సంపూర్ణహక్కులు లభిస్తాయని, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసి వివాదానికి తావులేని రీతిలో పత్రాలు అందజేస్తున్నదని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. సంపూర్ణ గృహహక్కు పథకంలో భాగంగా ఓటీఎస్‌ కింద సొమ్ములు చెల్లించిన గొల్లప్రోలు పట్టణం, మండలంలోని లబ్ధిదారులకు శుక్రవారం ఆయన రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గొల్లప్రోలు నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు. జడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగలోవరాజు, ఏఎంసీ చైర్మన్‌ తెడ్లపు చిన్నారావు, గండ్రేటి రాము, మొగలి బాబ్జి, కమిషనర్‌ లక్ష్మీపతిరావు, ఎంపీడీవో హరిప్రియ, జ్యోతుల భీముడు, మొగలి అయ్యారావు పాల్గొన్నారు.

ఓటీఎస్‌ పేదల పాలిట వరం

కొత్తపల్లి: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పేదల పాలిట వరమని ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. మండలంలో వివిధ గ్రామాల్లో ఓటీఎస్‌  పథకం కింద సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు శుక్రవారం ఆయన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను అందజేశారు. మండలంలో సుమారు 2వేల మంది ఓటీఎస్‌ పథకంలో నమోదు కాగా ఇప్పటివరకు డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను అందజేస్నున్నామని  ఎమ్మెల్యే దొరబాబు చెప్పారు. కొత్తపల్లి ఎంపీపీ కారే సుధాశ్రీనివాసరావు,వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, రాష్ట్ర యువజన విభాగ అఽధ్యక్షుడు మాదిరెడ్డి దొరబాబు, వైసీపీ మండలశాఖ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్‌, మండలపరిషత్‌ ఉపాధ్యక్షుడు శెట్టిబత్తిన సురేష్‌కుమార్‌, ప్రత్యేకాధికారి సుబ్బారావు, తహశీల్ధార్‌ లింకే శివకుమార్‌, ఎంపీడీవో పి.వసంతమాధవి, రైతుభరోసా కేంద్రాల సలహాసంఘ ఛైర్మన్‌ జ్యోతుల బాబు పాల్గొన్నారు.Updated Date - 2021-12-25T05:43:40+05:30 IST