ఇళ్లకూ నిధుల గ్రహణం

ABN , First Publish Date - 2021-12-15T07:11:53+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.

ఇళ్లకూ నిధుల గ్రహణం
చిందాడగరువులో జగనన్న కాలనీల్లో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు

జగనన్న కాలనీల్లో అసంపూర్తిగా నిలిచిన వందలాది గృహాలు

బిల్లుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు

కాలనీల్లో కనీస వసతులూ కరువే

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు చెల్లిం చడంలో ఎనలేని జాప్యం జరుగుతోంది. దాంతో లబ్ధిదారులు ఆందోళన చెందు తున్నారు. ఈ నేపథ్యంలో కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగు తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామాన జగనన్న కాలనీలను అభివృద్ధి చేయాలని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గతంలో శ్రీకారం చుట్టింది. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రుణ సదు పాయం కూడా కల్పిస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. అయితే ఆర్థికపరమైన సమస్యలతో జగనన్న కాలనీల అభివృద్ధి పూర్తిగా మరుగన పడిందనే చెప్పాలి. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. హడావుడిగా లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయించారు. లబ్ధిదారుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఇళ్ల నిర్మాణ పునాది పనులను హడావుడిగా ప్రారంభింపజేశారు. అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో చూస్తే 128 జగనన్న కాలనీల లేఅవుట్లు ఉన్నాయి. వాటిలో 11,832 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. సొంత స్థలా లు ఉన్నవారు డివిజన్‌లో 1,230 మంది ఉన్నారు. డివిజన్‌ వ్యాప్తంగా 1,362 ఇళ్ల స్థలాలకు సంబంధించి అధికారుల ఒత్తిడితో జగనన్న కాలనీల లేఅవు ట్లలో ఇళ్ల స్థలాల పునాదులు వేశారు. ఇందుకోసం అప్పులుచేసి మరీ పనులు చేపట్టారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కొంత సిమెంటుతోపాటు డ్వాక్రా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించినప్పటికీ మొత్తం నిధులు పునా దులకు కూడా సరిపోని పరిస్థితి. దాంతో కాలనీల్లో వందలాది పునాదులు వివిధ దశల్లో పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా జగనన్న కాలనీల్లో పునాదులు నిర్మించుక్ను 1300 మందికిపైగా లబ్ధిదారులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాలేదు. లబ్ధిదారుల బిల్లులు ప్రభుత్వం విడుదల చేస్తే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పడతాయని, దీనికోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గృహనిర్మాణ సంస్థ ఈఈ వై శ్రీనివాస్‌ పేర్కొన్నారు. లబ్ధిదారులకు సం బంధించిన బిల్లులను ప్రభుత్వానికి నివేదించామని, త్వరలోనే నిధులు రావచ్చ ని తెలిపారు. ఇటు చూస్తే ఇళ్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోయిం ది. తాపీ మేస్ర్తీల జీతాల నుంచి ఇనుము, కంకర, సిమెంటు ధరలతోపాటు ఇసుక ధర కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉండడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఒత్తిడితోనే తాము పునాదుల వరకు నిర్మించుకున్నామని, పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించా లంటే లక్షలాది రూపాయలను అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇళ్ల పట్టాల పం పిణీ సమయంలో ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇస్తుందన్న హామీ తో తాము కొంతమేర పెట్టుబడులు పెట్టుకుని పునాదులు నిర్మించుకున్నామని, ప్రభుత్వం ఇళ్లు నిర్మించే స్థితిలో లేదనే విషయాన్ని గ్రహిస్తున్న లబ్ధిదారులు కనీసం నిర్మించిన పునాదుల బిల్లులైనా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-12-15T07:11:53+05:30 IST