హిందూ దేవాలయాలపై పెరిగిన దాడులు

ABN , First Publish Date - 2021-08-10T06:10:24+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

హిందూ దేవాలయాలపై పెరిగిన దాడులు

బిక్కవోలు, ఆగస్టు 9: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విశాఖలో ఉన్న ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బిక్కవోలు గోలింగేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీని ఖండించారు. మూడురోజులక్రితం నంది విగ్రహం చోరీ అయితే అధికారులు, పోలీసులు విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ చోరీపై అధికారుల నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. ఈ సంఘటనకు కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-08-10T06:10:24+05:30 IST