హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2021-03-24T06:30:58+05:30 IST

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సమరసతా సేవా ఫౌండేషన్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్‌ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి

ఐ.పోలవరం, మార్చి 23: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సమరసతా సేవా ఫౌండేషన్‌,  రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్‌ ప్రతినిధులు పిలుపునిచ్చారు. మురమళ్లలో నడింపల్లి గణపతిమూర్తివర్మ ఇంటి ప్రాంగణంలో మంగళవారం హిందూ బంధువుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈసందర్భంగా మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ పెన్మెత్స కామరాజు మాట్లాడుతూ  మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. సమావేశంలో సర్పంచ్‌ కాళే రాజబాబు, నాగాభట్ల రవిశర్మ, వై.లక్ష్మి, దువ్వూరి లక్ష్మీగాయత్రి, బులుసు జగదీష్‌, నండూరి కృష్ణ, కె.చైతన్య, బొంతు కనకారావు, పేరాబత్తుల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-24T06:30:58+05:30 IST