ఉద్యాన పరిశోధనాస్థానం సేవలు ఉపయోగించుకోవాలి
ABN , First Publish Date - 2021-03-24T06:26:39+05:30 IST
రైతులు అంబాజీపేట ఉద్యాన పరిశోధనాస్థానం సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మేలురకమైన దిగుబడులు, లాభాలు పొందవచ్చని వైఎస్సార్ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ టి.జానకీరాయ్ పేర్కొన్నారు.

కొత్తపేట, మార్చి 23: రైతులు అంబాజీపేట ఉద్యాన పరిశోధనాస్థానం సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మేలురకమైన దిగుబడులు, లాభాలు పొందవచ్చని వైఎస్సార్ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ టి.జానకీరాయ్ పేర్కొన్నారు. మంగళవారం దత్తత గ్రామం అవిడి విచ్చేసి రైతులకు కొబ్బరి, అరటిసాగులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జానకీరాయ్ మాట్లాడుతూ అంబాజీపేట పరిశోధనా స్థానం సేవలను రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వీఎన్‌కే రెడ్డి, డాక్టర్ బీవీకే భగవాన్, ఎస్.రామ్మోహనరావు, ఎన్.మల్లికార్జునరావు, ఉద్యా న అధికారి పీబీఎస్ అమరనాథ్, అవిడి సర్పంచ్ రెడ్డి చంటి, అంబాజీపేట ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.