92 కోడి కత్తులు స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-12T05:45:24+05:30 IST
ఎస్‌ఐ షరీఫ్ ఆధ్వర్యంలో సిబ్బంది మండలంలోని మొల్లేరు రాముల దేవుపురం గ్రామాల్లో సోమవారం దాడులు నిర్వహించారు.

గంగవరం, జనవరి 11: ఎస్‌ఐ షరీఫ్ ఆధ్వర్యంలో సిబ్బంది మండలంలోని మొల్లేరు రాముల దేవుపురం గ్రామాల్లో సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందేల నిర్వహణకు ఉపయోగించే 92 కత్తులను స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.