కోడి పందేల ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-01-12T07:22:56+05:30 IST

సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణకు పల్లిపాలెంలో ఏర్పాటుచేసిన బరిని పోలీసులు సోమవారం సాయంత్రం తొలగించారు.

కోడి పందేల ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు

ముమ్మిడివరం, జనవరి 11: సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణకు పల్లిపాలెంలో ఏర్పాటుచేసిన బరిని పోలీసులు సోమవారం సాయంత్రం తొలగించారు. ఈ బరికి రోజుకు రూ.1.50 లక్షలు వంతున ఇచ్చేలా కొందరు వేలంపాట పాడుకున్నారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించి అడ్డుకునే ప్రయత్నాలు చేపట్టారు. బరి నిర్వాహకులు పల్లిపాలెంలోని లేఅవుట్‌లో భారీటెంట్స్‌ను, ఫ్లడ్‌లైట్స్‌ను ఏర్పాటుచేయగా పోలీసులు తొలగించారు. రాజుపాలెంలో కూడా కోడిపందేల నిర్వహణకు సంబంధించి ఏర్పాటుచేస్తున్న బరిని పోలీసు అధికారులు ట్రాక్టర్లతో ధ్వంసం చేయించారు. 


స్థా

Updated Date - 2021-01-12T07:22:56+05:30 IST