కోడి పందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-01-13T05:49:27+05:30 IST

చిన్నచిన్న బరులను ట్రాక్టర్లతో దున్నేస్తున్న పోలీసులకు సవాల్‌ విసురు తున్నట్లుగా ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కోడి పందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు

ఐ.పోలవరం, జనవరి 12: చిన్నచిన్న బరులను ట్రాక్టర్లతో దున్నేస్తున్న పోలీసులకు సవాల్‌ విసురు తున్నట్లుగా ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడి పందేల శిబిరం మినీ స్టేడియంను తలపిస్తోంది. సువిశాలమైన సుమారు ఏడెకరాల వ్యవసాయ క్షేత్రంలో భారీ స్థాయిలో సదుపాయాలు కల్పించారు. కోడి పందేల శిబిరం చుట్టూ ఐరన్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో తీర్చిదిద్దారు. అంతేకాకుండా వీఐపీలు పందేలు వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. విందు భోజనాలు ఆరగించేందుకు ప్రత్యేక గ్యాలరీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కోడిపందేలతో పాటు గుండాట బోర్డులు కూడా ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.  పందేలను వీక్షించేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. కోడిపందేల శిబిరం వద్ద తినుబండారాల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. పండుగ మూడ్రోజులపాటు యథే చ్ఛగా పేకాట, గుండాట వంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. చిన్న బరులను ట్రాక్టర్లతో దున్నేస్తున్న పోలీసులకు.. కేశనకుర్రు పాలెంలో భారీ స్థాయిలో టెంట్‌లు, ఇతర సామగ్రితో ఏర్పాట్లు చేస్తున్నా కనిపించకపోవడం విశేషం.. 

Updated Date - 2021-01-13T05:49:27+05:30 IST