పాలకులు ప్రజలకు భరోసా కల్పించాలి: మంత్రి వేణు

ABN , First Publish Date - 2021-08-27T06:29:42+05:30 IST

కౌన్సిల్‌ సభ్యులు వార్డుల్లో పర్యటించి ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందుకు వచ్చి సమ స్యలను తక్షణం పరిష్కరించాలని, పారశుధ్యానికి ప్రాధాన్య మిచ్చి, స్వచ్ఛ రామచంద్రపురం ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి చెల్లుబోయిన వేణు కోరారు.

పాలకులు ప్రజలకు భరోసా కల్పించాలి: మంత్రి వేణు

రామచంద్రపురం, ఆగస్టు 26: కౌన్సిల్‌ సభ్యులు వార్డుల్లో పర్యటించి ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందుకు వచ్చి సమ స్యలను తక్షణం పరిష్కరించాలని, పారశుధ్యానికి ప్రాధాన్య మిచ్చి, స్వచ్ఛ రామచంద్రపురం ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి చెల్లుబోయిన వేణు కోరారు. గురువారం రామచంద్రపురం కౌన్సిల్‌ హాలులో చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రజలే పాలకులు, పాలకులే ప్రజలుగా భావించి పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. పురపాలక సంఘానికి 15వ ఆర్థిక సంఘ నిధులు 2020-21 సంవత్స రానికి టైడ్‌ గ్రాంట్‌ కింద 8 పనుల నిమిత్తం  రూ.2కోట్లకు మే నెలలో జరిగిన కౌన్సిల్‌లో తీర్మానం పంపామన్నారు. దాని నిమిత్తం రూ.91,21336 పుర, పరిపాలనా శాఖ నిధుల నుంచి ప్రతిపాదనలను తాడేపల్లి పంపగా అజెండాలోని 18 అంశాల్లో కాంట్రాక్ట్‌ పనుల నిమిత్తం రూ.2.12 కోట్లకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో మునిసిపల్‌ మేనేజరు దుగ్గిరాల దుర్గాప్రసాద్‌, కమిషనరు కె.శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు చింతపల్లి నాగేశ్వరరావు, కోలమూరి శివాజీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-27T06:29:42+05:30 IST