ఉద్యానవన పంటల్లో సమగ్ర సస్యరక్షణ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-10-29T05:47:59+05:30 IST
ఉద్యానవన పంటల్లో సస్యరక్షణ తప్పనిసరి అని, ఈ పంటలపై కొమ్మ కత్తిరింపునకు కూడా ప్రాధాన్యం ఉందని ఆత్మ పీడీ జ్యోతిర్మయి రైతులకు సూచించారు.
రంగంపేట, అక్టోబరు 28: ఉద్యానవన పంటల్లో సస్యరక్షణ తప్పనిసరి అని, ఈ పంటలపై కొమ్మ కత్తిరింపునకు కూడా ప్రాధాన్యం ఉందని ఆత్మ పీడీ జ్యోతిర్మయి రైతులకు సూచించారు. కోటపాడులో ఉద్యానవన రైతులకు గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. నిమ్మ, సపోటా, జామ, జీడి మామిడి, మామిడి, బత్తాయి రైతులతో కిసాన్ గోష్ఠి నిర్వహించారు. వైఎస్సార్ ఉద్యానవన వర్శిటీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త బి.రమేష్‌బాబు ఉద్యానవన తోటల్లో పోషక యాజమాన్యం, సస్యరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ వో సుజాత పాల్గొన్నారు.