గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారిని వదిలేసి..: హర్షకుమార్

ABN , First Publish Date - 2021-11-05T19:59:51+05:30 IST

హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.

గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారిని వదిలేసి..: హర్షకుమార్

తూ.గో. జిల్లా: దేశాన్ని పట్టిపీడిస్తున్న పునుబూతం డ్రగ్స్ అని, హెరాయిన్ మూలాలు ఎక్కడున్నాయో ఎన్ఐఏ ప్రకటించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టులో అక్రమంగా దిగుమతి అవుతున్న.. క్రూడ్ ఆయిల్ దొంగ వ్యాపారం చేస్తున్నదెవరని ప్రశ్నించారు. గంజాయి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వారిని వదిలేసి.. గిరిజన యువకులపై కేసులు పెట్టడం పోలీస్ శాఖకు అవమానమన్నారు. వివేకా హత్యకేసు వివరాలను సీబీఐ బయటపెట్టాలన్నారు. అమరావతి రైతులను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని హర్షకుమార్ విమర్శించారు.

Updated Date - 2021-11-05T19:59:51+05:30 IST