ముగిసిన హ్యాండ్‌బాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-03-22T05:55:39+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చార్టీస్‌ ఆవరణలో జరుగుతున్న ప్రసంగి వెంకటరత్నం స్మారక సీనియర్స్‌ రాష్ట్రసాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి.

ముగిసిన హ్యాండ్‌బాల్‌ పోటీలు
రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలలో తృతీయ స్థానం పొందిన తూర్పు జట్టు

కాకినాడ స్పోర్ట్స్‌, మార్చి 21: తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చార్టీస్‌ ఆవరణలో జరుగుతున్న ప్రసంగి వెంకటరత్నం స్మారక సీనియర్స్‌ రాష్ట్రసాయి హ్యాండ్‌ బాల్‌  పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీలలో  కర్నూలు ప్రథమ, విశాఖ ద్వితీయ, తూర్పు తృతీయ స్థానాలు సాధించాయి. పోటీల ముగింపోత్సవానికి సంఘం అఽధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ అఽధ్యక్షత వహించారు. ఐడియల్‌ జూనియర్‌ కళాశాల పీడీ తాతబ్బాయి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు, వై.సాగర్‌, రవికుమార్‌, బాబ్జి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T05:55:39+05:30 IST