గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-06-22T06:20:58+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని రాజోలు ప్రిన్సి పాల్‌ ఎస్‌.తబిత తెలిపారు.

గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాజోలు, జూన్‌ 21: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని రాజోలు ప్రిన్సి పాల్‌ ఎస్‌.తబిత తెలిపారు. సోమవారం ఆమె మాట్లా డుతూ జూలై7వరకు ఏపీజీపీసెట్‌.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఎన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఐదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో ఎస్సీలకు 60, బీసీ ‘సీ’లకు 10, ఎస్టీలకు 5, బీసీలకు 4, ఓసీలకు ఒక సీటు కేటాయించి నట్టు చెప్పారు. ఇంటర్‌  ఎంపీసీలో 40 , బైపీసీలో 40 సీట్లు ఉన్నట్టు చెప్పారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.  పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం పాఠశాల పనిచేసే సమయంలో ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని ఆమె కోరారు. 

Updated Date - 2021-06-22T06:20:58+05:30 IST