గుడా పరిధిలో 7,035 దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-03-21T05:43:29+05:30 IST
లేఅవుట్ రేగ్యులరైజేషన స్కీమ్, భవన నిర్మాణాల లేఅవుట్ల అనుమతుల కోసం గుడా వద్ద 7,035 దరఖా స్తులు దాఖలయ్యాయని గుడా వైస్ చైర్మన ఎ.రవీంద్రనాథ్ తెలిపారు.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 20: లేఅవుట్ రేగ్యులరైజేషన స్కీమ్, భవన నిర్మాణాల లేఅవుట్ల అనుమతుల కోసం గుడా వద్ద 7,035 దరఖా స్తులు దాఖలయ్యాయని గుడా వైస్ చైర్మన ఎ.రవీంద్రనాథ్ తెలిపారు. స్థానిక గుడా కార్యాలయంలో శనివారం ఆయన ఓపెన ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణదారుల అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జీవో నెం 10ని అనాథరైజ్డు భూముల క్రమబద్దీకరణ కోసం ఇచ్చారని చెప్పారు. గుడా నిబం ధనల ప్రకారం ఆయా భూములు సర్వేనెంబరులో ఉన్న ప్లాట్లు ఒకేసారి లేఅవుట్లు తయారు చేసి అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకుంటే జాప్యాలు లేకుండా అనుమతులు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్లానింగ్ అధికారి మూర్తి, కార్యదర్శి సన్యాసిరావు, సహాయ ప్లానింగ్ అధికారి శాంతిలత, శ్రీధర్, సూర్యనారాయణ పాల్గొన్నారు.