త్వరలో జీఎస్‌పీసీ పరిహారం నిధులు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-08-10T06:27:14+05:30 IST

మత్స్యకారులందరికీ త్వరలోనే రెండో దఫా జీఎస్‌పీసీ పరిహారం నిధులు పంపిణీ చేస్తామని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాసఅశోక్‌ తెలిపారు.

త్వరలో జీఎస్‌పీసీ పరిహారం నిధులు: ఎమ్మెల్యే

యానాం, ఆగస్టు 9: మత్స్యకారులందరికీ త్వరలోనే రెండో దఫా జీఎస్‌పీసీ పరిహారం నిధులు పంపిణీ చేస్తామని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాసఅశోక్‌ తెలిపారు. పదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్‌కుమార్‌తో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమై జీఎస్‌పీసీ పరిహారం నిధుల విడుదలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మొదటి దఫా పరిహారం నిధుల్లో పలు అవకతవకలు జరగడంతో రెండో విడత పంపిణీ ఆలస్యమవుతుందన్నారు. యానాంలో  ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి అరుణ్‌ను కోరినట్టు  తెలిపారు.  Updated Date - 2021-08-10T06:27:14+05:30 IST