గూడ్స్‌ రైలెక్కి సెల్ఫీ: బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-12-26T05:41:47+05:30 IST

కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలుబండి బోగి పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్‌ తీగలు తగిలి తీవ్రగాయాల పాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.

గూడ్స్‌ రైలెక్కి సెల్ఫీ: బాలుడి మృతి

జీజీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 25: కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలుబండి బోగి పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్‌ తీగలు తగిలి  తీవ్రగాయాల పాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.  కాకినాడ ఏటిమొగకు చెందిన పాలెపు నరసింహమూర్తి (16)  ఈనెల 21న పోర్టు రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ రైలెక్కి సెల్ఫీ తీసుకుంటున్నాడు. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగలడంతో కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.   స్థానికులు క్షతగాత్రుడిని జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-26T05:41:47+05:30 IST