గోదావరిలో రోశయ్య అస్థికల నిమజ్జనం
ABN , First Publish Date - 2021-12-09T06:03:29+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య అస్థికలను బుధవారం రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు వద్ద పవిత్ర గోదావరి నదిలో శాస్ర్తోక్తంగా నిమజ్జనం చేశారు.

రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 8 : మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య అస్థికలను బుధవారం రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు వద్ద పవిత్ర గోదావరి నదిలో శాస్ర్తోక్తంగా నిమజ్జనం చేశారు. అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ రోశయ్య కుమారులు శివసుబ్బారావు, ఎస్‌ఎన్ మూర్తి ఈ కార్యక్రమం నిర్వర్తించారు. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకొళపు శివరామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా పుష్కరాలరేవులో ప్రత్యేకంగా వేసిన వేదికపై పూజాధికాలు నిర్వహించారు. అనంతరం గోపూజ చేసి అస్థికలను టూరిజం బోట్లలో నది మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. రుడా ఛైర్‌పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, చాంబర్ ప్రముఖులు నందెపు శ్రీనివాస్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, చందన నాగేశ్వర్, నక్కా శ్రీనగేష్, మాసా రామజోగ్, ముళ్ల మాధవ్, మేడపాటి అనిల్, పిల్లి నిర్మల, బొంత శ్రీహరి, కోడి కోట, ఆర్యవైశ్య ప్రముఖులు కొల్లేపల్లి శేషయ్య, నందెపు శ్రీనివాస్, బూర్లగడ్ల సుబ్బారాయుడు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.