వాడపల్లిలో ఘనంగా గోదాదేవి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T05:25:19+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి బుధవారం భక్తులు పోటెత్తారు. గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.

వాడపల్లిలో ఘనంగా గోదాదేవి కల్యాణం
గోదాదేవి కల్యాణాన్ని జరిపిస్తున్న అర్చకస్వాములు

ఆత్రేయపురం, జనవరి 13: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి బుధవారం భక్తులు పోటెత్తారు. గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన వేదికపై గోదా దేవి అమ్మవారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నీరాజన మంత్రపుష్పాలను శాసో్త్రక్తంగా జరిపారు. పెళ్లికాని యువతీ, యువకులు అధిక సంఖ్యలో కల్యాణాన్ని వీక్షించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2021-01-14T05:25:19+05:30 IST