బాలికపై ఐదు నెలలుగా నలుగురు అత్యాచారం

ABN , First Publish Date - 2021-11-21T07:03:03+05:30 IST

రంపచోడవరం మం డలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై నలుగురు యువకులు ఐదునెలలుగా నిరంతరం ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలికపై ఐదు నెలలుగా  నలుగురు అత్యాచారం

 గర్భం దాల్చడంతో వెలుగు చూసిన వైనం

 కేసు నమోదు చేసిన పోలీసులు

రంపచోడవరం, నవంబరు 20: రంపచోడవరం మం డలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై నలుగురు యువకులు ఐదునెలలుగా నిరంతరం ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు బాలిక గర్భం దాల్చడంతో ఈ వ్య వహారం గ్రామంలో చర్చకు రావడం, గ్రామపెద్దలు పం చాయితీ నిర్వహించి బాధ్యులెవరన్న విషయాన్ని తేల్చేప్రయత్నం చేయగా నలుగురు యువకుల పేర్లు బయటపడ్డాయి. జీడిమామిడితోట పనులకోసం వెళ్లిన తనపై వారు వరుసగా నిరంతరం సాగించే అత్యాచారం అంశాన్ని ఆమె వివరించింది. దీంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలన్న పెద్దల సూచనతో శనివారం రంపచోడవరం పోలీసులకు ఆమె ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు సీఐత్రినాధ్‌ తెలిపారు.


Updated Date - 2021-11-21T07:03:03+05:30 IST