ప్రమాదవశాత్తూ కాలువలో పడి బాలిక మృతి

ABN , First Publish Date - 2021-02-26T05:40:45+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: ప్రమాదవశాత్తూ కాలువలో పడిన బాలిక గురువారం మృతి చెందిన సంఘటన కొవ్వూరులో జరిగింది. కాకినాడ రూరల్‌ మండలం కొవ్వూరు ఆంజనేయస్వామి ప్రాంతానికి చెందిన చెక్కా వెన్నెల(4) ఇంటి పక్కన చిన్న కాలువ ఉంది. గురువారం సాయంత్రం వెన్నె

ప్రమాదవశాత్తూ కాలువలో పడి బాలిక మృతి

జీజీహెచ్‌ (కాకినాడ), ఫిబ్రవరి 25: ప్రమాదవశాత్తూ కాలువలో పడిన బాలిక గురువారం మృతి చెందిన సంఘటన కొవ్వూరులో జరిగింది. కాకినాడ రూరల్‌ మండలం కొవ్వూరు ఆంజనేయస్వామి ప్రాంతానికి చెందిన చెక్కా వెన్నెల(4) ఇంటి పక్కన చిన్న కాలువ ఉంది. గురువారం సాయంత్రం వెన్నెల తల్లి మంచినీటి కోసం వెళ్లగా ఇంట్లో ఉన్న చిన్నారి బాలిక ఆడుకుంటూ ద్రాక్షపండ్లు తింటూ కాలువ వద్దకు వచ్చింది. ప్రమాదవశాత్తూ కాలువ గట్టు నుంచి జారిపడి కాలువలో పడిపోయింది. చిన్నారి కోసం వెతుకుతుండగా కాలువలో పడిపోయిన సంఘటన తెలిసి తక్షణమే పాపను చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పాప మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటనపై ఇంద్రపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-26T05:40:45+05:30 IST