గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-02-01T06:24:24+05:30 IST

పోలీసులు ఓ కారును వెంబడించి 76 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గొల్లప్రోలు మండలం వన్నెపూడి శివారు 16వ నెంబరు జాతీయ రహదారిపై పిఠాపురం సీఐ పి.రామచంద్రరావు, గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్‌.రామలింగేశ్వరరావు ఆదివారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గంజాయి స్వాధీనం

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 31: పోలీసులు ఓ కారును వెంబడించి 76 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గొల్లప్రోలు మండలం వన్నెపూడి శివారు 16వ నెంబరు జాతీయ రహదారిపై పిఠాపురం సీఐ పి.రామచంద్రరావు, గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్‌.రామలింగేశ్వరరావు ఆదివారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు ఓ కారు ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. దానిని ఆపేందుకు పోలీసులు వెంబడించారు. వన్నెపూడి సమీపంలో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. పోలీసులు వెళ్లే సరికి అందులోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కారులో 38 బస్తాల్లో ఉన్న 76 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని, కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-02-01T06:24:24+05:30 IST