300 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-11-02T05:39:12+05:30 IST

మోతుగూడెంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు వాహనాలను తనిఖీ చేస్తుండగా 300 కిలోల గంజాయి పట్టుకున్నారు.

300 కిలోల గంజాయి పట్టివేత

 మోతుగూడెం, నవంబరు 1: మోతుగూడెంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు వాహనాలను తనిఖీ చేస్తుండగా 300 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఇంతలూరు నుంచి తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ గ్రామానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మోతుగూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మినీ వ్యాన్‌,  హోండా కారులో గంజాయి లభించింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వాధిత తుకారాం, విశాఖపట్నం దుప్పులువాడకు చెందిన కిలోకుమార్‌, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన రాఽథోడ్‌ పార్లలా, ఒడిసా రాష్ట్రం చిత్రకొండకు చెందిన కిముడు రామచంద్ర గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని రంపచోడవరం కోర్టులో హాజరుపరిచారు. తనిఖీల్లో మోతుగూడెం ఎస్‌ఐ వాసంశెట్టి సత్తిబాబు, తహశీల్దార్‌ సాయికృష్ణ, ఎస్‌ఐలు పట్టాభిరామయ్య, సత్తిబాబు, హెడ్‌ కానిస్టేబుళ్లు వాసు, నాగేశ్వరరావు, ప్రసాదరావు, వీఆర్వో దేవయ్య, సీఆర్పీఎఫ్‌-జి-42 సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T05:39:12+05:30 IST