1000 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-09T06:04:43+05:30 IST

చింతూరు మండలం మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొడ్లపాలెం జంక్షన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పశువుల దాణా ముసుగులో భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న 1000 కిలోల గంజాయిని గుర్తించి ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చెప్పారు.

1000 కిలోల గంజాయి స్వాధీనం

 కాకినాడ క్రైం, నవంబరు 8 :   చింతూరు మండలం మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొడ్లపాలెం జంక్షన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పశువుల దాణా ముసుగులో భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న 1000 కిలోల గంజాయిని గుర్తించి ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై వచ్చిన సమాచారంతో చింతూరు సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ జి.కృష్ణకాంత్‌, చింతూరు సీఐ జి. యువకుమార్‌, మోతుగూడెం ఎస్‌ఐ వి.సత్తిబాబు సిబ్బందితో ఈనెల 7న వాహనాల తనిఖీ నిర్వహించగా లారీలో పశువుల దాణా లోడ్‌ కింద   కోటి విలువైన సుమారు 1000 కిలోల గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారన్నారు.   ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసికి గంజాయి తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వీరిలో ఓ పైలట్‌ పరారైనట్లు చెప్పారు.  గంజాయి ఒడిసాలో సాగు అవుతున్నట్లు తేలిందన్నారు.  మధ్యప్రదేశ్‌, గంగావ్‌ తహసిల్‌ జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్‌ పటేల్‌, రేవా జిల్లా జూద్మేనియా మౌరహాకు చెందిన మహమ్మద్‌ హారన్‌, ఒడిసా మల్కాజ్‌గిరి జిల్లా ఎంపీవీ79 కు చెందిన రాబిన్‌ మండల్‌, అమృతా బిశ్వాస్‌, నలగుంటి గ్రామం ఎంపీవీ 36కు చెందిన బసుదేబ్‌ మండల్‌లను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మల్కాజ్‌గిరికి చెందిన ఓ వ్యక్తి తప్పించుకున్నాడన్నారు. లారీ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌, హారో బైక్‌, ఏడు సెల్‌ఫోన్లు, రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు.  నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఏఎస్పీ జి.కృష్ణకాంత్‌, ఇతర అధికారులను ఎస్పీ అభినందించారు. సీఆర్‌ఫీఎఫ్‌ 42 బెటాలియన్‌ కమాండెంట్‌ సెంథిల్‌కుమార్‌, ఏఎస్పీ కె. కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T06:04:43+05:30 IST