స్నేహితుడిని చంపేశాడు!

ABN , First Publish Date - 2021-03-22T06:03:16+05:30 IST

పాతకక్షల నేపథ్యంలో మండపేట మండలం ద్వారపూడిలో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశాడు. మండపేట రూరల్‌ ఎస్‌ఐ పీతల దొరైరాజు వివరాలు అందించారు.

స్నేహితుడిని చంపేశాడు!

మండపేట, మార్చి 21: పాతకక్షల నేపథ్యంలో మండపేట మండలం ద్వారపూడిలో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశాడు. మండపేట రూరల్‌ ఎస్‌ఐ పీతల దొరైరాజు వివరాలు అందించారు.  ఈనెల 17న రాజానగరం మండలం చింతలనామవరానికి చెందిన రేలంగి సత్యనారాయణ కుమారుడు శ్రీను, అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు పుల్లురి రాంబాబును తీసుకుని మండపేట మండలం ద్వారపూడి ఆయ్యప్పస్వామివారి ఆలయం వద్దకు వచ్చాడు. అక్కడ కాల్వలో స్నానం చేస్తుండగా శ్రీనును రాంబాబు బలవంతంగా ముంచి చంపేశాడు. తర్వాత ఏమీ తెలియదన్నట్లు  తాను స్నానం చేస్తుండగా శ్రీను కనిపించ లేదని  శ్రీను తండ్రికి చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన శ్రీను తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసిన మండపేట రూరల్‌ పోలీసులు విచారణ నిర్వహించగా రాంబాబు అసలు విషయం చెప్పాడు.  శ్రీనుకు, తనకు ఉన్న పాతగొడవల నేపథ్యంలో కాల్వలో ముంచి హత్య చేశానని రాంబాబు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. దీంతో శ్రీను మృతదేహం కోసం గాలించగా అనపర్తి ఆయ్యప్పస్వామివారి ఆలయం వద్ద ఉన్న కెనాల్‌లో లభ్యమైంది. శ్రీను మృతికి కారణమైన రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ ఎస్‌ఐ దొరైరాజు తెలిపారు.

Updated Date - 2021-03-22T06:03:16+05:30 IST